వేణుగోపాల్ నాయక్...
హుజూర్ నగర్: వంద రోజుల నిక్షయ్ శివిర్ కార్యక్రమంలో భాగంగా లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన శిబిరాలు విజయవంతం అయినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ వేణుగోపాల్ నాయక్ తెలియజేశారు. గురువారం వేపల సింగారం గ్రామంలో నిర్వహించిన నీక్షయ్ శివర్ క్షయ నిర్ధారణ పరీక్షల శిబిరంలో ఆయన మాట్లాడుతూ... ఏడు ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో నిర్వహించిన క్యాంపుల్లో క్షయ వ్యాధి లక్షణాలు కలిగిన అనుమానితులకు, వ్యాధి గ్రస్తుల కుటుంబ సభ్యులకు కల్లె పరీక్షలు నిర్వహించడమే కాక, క్షయ వ్యాధి కలిగి పేదలైనటువంటి వారికి త్వరగా కోలుకోవడానికి పోషకాహార నిమిత్తం ఇద్దరు లింగగిరి ఆరోగ్య కేంద్ర ఉద్యోగులు పద్మ, హెల్త్ అసిస్టెంట్ ఇందిరాల రామకృష్ణలు రోగి చికిత్స కాలం ముగిసే వరకు నెలకు 800 రూపాయల విలువగల నిక్షయ్ మిత్ర కిట్స్ ను అందించినట్లు తెలిపారు. ఒక క్షయ రోగి మందులు వాడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే సంవత్సరానికి ఆ ప్రాంతంలో 12 నుంచి15 మందికి వ్యాధిని వ్యాప్తి చేసే అవకాశం ఉన్నందున ప్రజలు సమీప అరోగ్య సిబ్బందికి, ఆశా కార్యకర్తలకు సమాచారం అందిచాలన్నారు.