‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నవంబర్ 15 న విడుదలైన ఈ సిరీస్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో ఈ హిస్టారికల్ సోషల్ పొలిటికల్ డ్రామాను మోనీషా అద్వానీ, మధు బోజ్వానీ, డానిష్ ఖాన్ ఈ సిరీస్‌ను నిర్మించారు. చిరాగ్ వోరా, సిద్ధాంత్ గుప్తా, రాజేంద్ర చావ్లా, ల్యూక్ ల్యూక్ మెక్‌గిబ్నే తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. మన దేశానికి స్వాతంత్ర్యం రావటానికి ఎందరో నాయకులు ఎన్నో త్యాగాలు చేశారు. ఆనాటి పరిస్థితులను, ఇండియా విభజనకు దారితీసిన పరిణామాలను, మన నాయకులు- గాంధీ, నెహ్రూ, పటేల్ తదితరులు ఎదుర్కున్న సవాళ్లు, సంఘర్షణ, వాటిని ఎదుర్కున్న తీరును అద్భుతమైన మేకింగ్‌తో కళ్లకు కట్టినట్లు మేకర్స్ తెరకెక్కించారు. నవంబర్ 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. స్కామ్ 1992, స్కామ్ 2003,మహారాణి లాంటి బ్లాక్ బస్టర్ షోల తర్వాత, సోనీ లివ్ నుంచి ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ సిరీస్ వచ్చింది.
ఈ సందర్భంగా.. దర్శకుడు నిఖిల్ అద్వానీ మాట్లాడుతూ ‘‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ వంటి హిస్టారికల్ డ్రామాను తెరకెక్కించాలనుకోవటం చాలా కష్టసాధ్యమైంది. అయితే దాన్ని మా మేకర్స్ నిజం చేశారు. నాటి వాస్తవ పరిస్థితులను ఈ సిరీస్ ద్వారా వివరించే ప్రయత్నం చేశాం. నవంబర్ 15 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతూ ఆడియెన్స్‌ను అలరిస్తుంది. ఈ సిరీస్‌ను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. నిర్మాతలు మోనీషా అద్వానీ, మధు బోజ్వానీ, డానిష్ ఖాన్ మాట్లాడుతూ ‘‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ సిరీస్‌ను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మనం ఈరోజు సంతోషంగా ఉండటానికి కారణం .. ఎందరో అమరవీరుల త్యాగఫలం. నాటి విషయాలను, దేశ విభజన సమయంలో మన నాయకులు ఎదుర్కొన్న కష్టాలను, రాజకీయ పరిస్థితులను నిఖిల్ అద్వానీగారు అద్బుతంగా తెరకెక్కించారు’’ అని తెలిపారు.