న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ బరిలోకి దిగనున్న భారత బాక్సర్లు నిఖత్ జరీన్ (50 కేజీలు), లవ్లీనా బొర్గోహై (75 కేజీలు), అమిత్ పంగల్ (51 కేజీలు) జర్మనీలో ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారు. విశ్వక్రీడల సన్నద్ధతలో భాగంగా.. మన బాక్సర్లు జర్మీనీలో ప్రత్యేక ట్రైనింగ్ క్యాంప్‌లో పాల్గొన నున్నారు. ఈ జాబితాలో నిశాంత్ దేవ్ (71 కేజీలు), ప్రీతి పవార్ (54 కేజీలు), జస్మీన్ లంబోరియా (57 కేజీలు) కూడా ఉన్నారు. ‘ఈ ప్రత్యేక శిక్షణ శిబిరంలో వేర్వేరు దేశాలకు చెందిన అగ్రశ్రేణి బాక్సర్లతో మనవాళ్లు కలిసి ప్రాక్టీస్ చేయనున్నారు.
అది విశ్వక్రీడల్లో మనవాళ్లకు ఎంతగానో తోడ్పడుతుంది. పారిస్ వాతావరణ పరిస్థితులకు జర్మనీ దగ్గరగా ఉంటుంది. దీంతో ఒలింపిక్స్‌కు ముందే అక్కడి పరిస్థితులను అర్థం చేసుకునేందుకు కూడా మన బాక్సర్లకు ఇది చక్కటి అవకాశాం’అని భారత బాక్సింగ్ సమాఖ్య కార్యదర్శి హేమంత్ కుమార్ పేర్కొన్నారు. వచ్చే నెల 22 వరకు భారత బాక్సర్లు జర్మనీలో ఉండనున్నట్లు వెల్లడించారు. కాగా.. పారిస్ ఒలింపిక్స్ భారత్ నుంచి ఆరుగురు బాక్సర్లు (ఇద్దరు పరుషులు, నలుగురు మహిళలు) అర్హత సాధించిన విషయం తెలిసిందే.