ఎలోర్డా బాక్సింగ్ టోర్నీ
ఆస్థానా (కజకిస్థాన్): తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ఆస్థానా వేదికగా జరుగుతున్న ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నీలో శుభారంభం చేసింది. సోమవారం 52 కేజీల విభాగం తొలి రౌండ్లో వరల్డ్ చాంపియన్ నిఖత్ 5 కజకిస్థాన్‌కు చెందిన రాఖీ ఝన్సయాను చిత్తుగా ఓడించింది. ఇక మిగతా వారిలో మీనాక్షి(48 కేజీలు) కజకిస్థాన్‌కు చెందిన రొక్సానాపై 4 విజయాన్ని అందుకుంది. 50 కేజీల విభాగంలో అనామిక రిఫరీ స్టాప్ ది కంటెస్ట్ (ఆర్ఎస్సీ) ద్వారా విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఇష్మీత్ సింగ్ (75 కేజీలు), సోనియా (54 కేజీలు) పరాజయం పాలయ్యారు. ఇక పురుషుల విభాగంలో శివ థాపా, సంజయ్, గౌరవ్ చౌహాన్లు మంగళవారం తొలి రౌండ్ ఆడనున్నారు.