04-04-2025 12:00:00 AM
గతంలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న నిహారిక కొణిదెల 2024లో నిర్మాతగా మారారు. ఆ ఏడాది తొలిసారిగా ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రాన్ని నిర్మించడం ద్వారా తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా ముద్ర వేశారు. తాజాగా ఆమె తన సొంత నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి రెండో చిత్రాన్ని ప్రకటించారు.
‘మ్యాడ్’, ‘మ్యాడ్‌స్క్వేర్’లలో తన నటనతో ఆకట్టుకున్న సంగీత్‌శోభన్ ఇందు లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు మానసశర్మ కథను అందిస్తూ దర్శకత్వం వహిస్తుండగా.. మహేశ్ ఉప్పల కో రైటర్‌గా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.