- అత్యధికంగా ఆర్డర్ చేసిన వస్తువుల్లో కండోమ్స్
- హ్యాండ్ కప్స్ కూడా..
- డాటాను షేర్ చేసిన బ్లింకిట్ సీఈవో
న్యూఢిల్లీ, జనవరి 1: డిసెంబర్ 31.. ముగిసింది. డిసెంబర్ 31 అంటే తాగుడు.. ఊగుడు అని అంతా అనుకుంటారు. కానీ ఈ 2024 డిసెంబర్ 31కి యువత ఎక్కువ మోతాదులో ఆన్‌లైన్ ఆర్డర్లతోనే సమయం వెచ్చించారు. వారు చేసిన ఆర్డర్లే దీన్ని నిరూపిస్తున్నా యి. డిసెంబర్ 31 రోజు దేశవ్యాప్తంగా ఎక్కువగా ఏ వస్తువులు ఆర్డర్ చేశారో ప్రముఖ ‘క్విక్ కామర్స్’ బ్లింకిట్ సీఈవో అల్బీందర్ దిండ్సా తెలిపారు.
ద్రాక్ష పండ్ల నుంచి కండోమ్‌ల వరకు ఏది ఎంత మోతాదులో ఆర్డర్ చేశారో వివరించారు. ఎవరూ ఊహించని రీతిలో యు వత హ్యాండ్ కఫ్స్ కూడా ఆర్డర్ చేశారు. రోజువారీగా డెలివరీ చేసే ద్రాక్షల కంటే దాదాపు 7 రెట్లు ఎక్కువగా 31 రోజు ఆర్డర్ చేశారట. ఇక కండోమ్స్‌లో ఎక్కువగా చాక్లెట్ ఫ్లేవర్ కండో మ్స్ ఆర్డర్ చేశారు. తర్వాతి స్థానంలో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ నిలిచింది.
ఇవి మాత్రమే కాకుండా ఎప్పుడూ లేని విధంగా పురుషుల డ్రాయర్లు కూడా ఆర్డర్ చేశారట. వీటితో పాటు ఆలూ భుజియా, లిప్ స్టిక్‌లు, కోల్డ్ డ్రింక్‌లు ఆర్డర్ చేసినట్లు అల్బీందర్ వెల్లడించారు. కేవలం బ్లింకిట్‌లో మాత్రమే కాకుండా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌తో పాటు వేరే క్విక్ కామర్స్ సంస్థల్లో కూడా రికార్డు స్థాయిలో ఆర్డర్లు పెరిగాయి.
జెట్ స్పీడ్‌తో పెరిగిన ఆర్డర్లు
పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోల్చుకుంటే ఆర్డర్ల విలువ జెట్ స్పీడ్‌తో పెరిగింది. కోల్డ్ డ్రింక్స్ 394 శాతం ఎక్కువగా, సాఫ్ట్ డ్రింక్స్ 941 శాతం అధికంగా ఆర్డర్ చేశారు. ఆల్కహాల్ లేని బీర్ల విషయానికి వస్తే ఎవరూ ఊహించని విధంగా 1541 శాతం వృద్ధి నమోదైంది. తినుబండారాలు మాత్రమే కాకుండా గేమ్స్‌కు సంబంధించిన ఆర్డర్లు 600 శాతం పెరిగాయి. క్విక్ కామర్స్ ఆర్డర్లలో బెంగళూరు తొలి స్థానంలో నిలిచింది.