న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నైజీరియా అత్యున్నత పురస్కారం లభించింది. ప్రధాని మోదీకి మోదీకి 'ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్' పురస్కారాని నైజీరియా ప్రభుత్వం ఇవ్వనుంది. 1969లో క్వీన్ ఎలిజబెత్ కు నైజీరియా ఈ అవార్డును ప్రధానం చేసింది. ఆ తర్వాత విదేశీ ప్రముఖుడిగా ఈ గౌరవం మోదీకి దక్కింది. విదేశాల్లో ఆయన అందుకున్న అత్యున్నత అంతర్జాతీయ అవార్డుల్లో ఇది 17వ పురస్కారం.
నైజీరియా దేశాధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు ఆహ్వానం మేరకు మోదీ ఆదివారం నైజీరియా చేరకున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించిన అనంతరం జీ-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్తారు. 18,19వ తేదీల్లో రియో డీ జనీరోలో జరిగే శిఖారాగ్ర సమావేశానికి మోదీ, చైనా అధ్యక్షుడు జన్ పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తదితరులు హజరుకానున్నారు. 19న మోదీ గయానాకు చేరుకొని అక్కడే 21కి వరకు ఉంటారు.