calender_icon.png 5 November, 2024 | 9:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేరళలో ‘నిఫా’ కలకలం

22-07-2024 02:46:33 AM

  1. గుండెపోటుతో 14 ఏళ్ల బాలుడు మృతి
  2. విఫలమైన వైద్యుల ప్రయత్నాలు
  3. ఆందోళనలో ప్రజలు

తిరువనంతపురం, జూలై 21: కేరళలో నిఫా వైరస్ గుబులు రేపుతోంది. ఈ వైరస్ సోకడం వల్ల మళప్పురానికి చెందిన 14 ఏళ్ల బాలుడు మృత్యువాత పడ్డట్లు కేరళ వైద్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఆ బాలుడికి వైరస్ నిర్ధారణ అయిన గంటల వ్యవధిలోనే మరణించడం ఆందోళన కలిగిస్తోంది. బాలుడికి నిఫా వైరస్ సోకినట్లు పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్ధారించినట్లు మంత్రి శనివారమే వెల్లడించారు. ఆ బాలుడిని కోజికోడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపే.. ఆదివారం ఉదయం మూత్రం ఆగిపోయి, గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.

బాలుడికి  గుండెపోటు వచ్చి ందని ఆరోగ్యమంత్రి ప్రకటించిన గంటలోపే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.  ఆ బాలుడు ఎవరరెవరితో కాంటాక్ట్ అయ్యాడనే విషయం గురించి అధికారులు ఆరా తీశారు. బాలుడి అంత్యక్రియలకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, ఆ విషయంపై బాలుడి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో మాట్లాడుతామని కలెక్టర్ ప్రకటించారు. నిఫా వైరస్ కారణంగా చనిపోయిన వ్యక్తితో కాంటాక్ట్ అయిన  214 మందిని ఐసోలేషన్‌లో ఉంచారు. వీరిలో 60 మంది మాత్రం హైరిస్క్ క్యాటగిరీలో ఉన్నారు.

ఇప్పటికే మళప్పురంలో 24 గంటల కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. వైరస్ సోకిన బాలుడు తిరిగిన ప్రాంతం నుంచి 3 కిలోమీటర్ల మేర ఆంక్షలు విధించే అంశాన్ని కలెక్టర్, ఎస్పీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతేడాది కూడా కేరళను నిఫా వైరస్ వణికించింది. ప్రభుత్వ అప్రమత్తత వల్ల ఎక్కువ ప్రాణనష్టం జరగలేదు.  అలాగే 2018లో అయితే ఏకంగా 21 మందిని ఈ వైరస్ పొట్టన పెట్టుకుంది. ఈ వైరస్ గబ్బిలాల నుంచి వ్యాప్తి చెందుతుందని అంతా చెబుతున్నా.. కానీ ఇప్పటివరకు  నిర్ధారణ కాకపోవడం గమనార్హం. 

అసలేంటీ ‘నిఫా’ లక్షణాలు.. 

నిఫా వైరస్‌ను 1999లో గుర్తించారు. ఇది జంతువుల నుంచి సోకుతుంది దీనిని జునోటిక్ వైరస్‌గా పేర్కొంటారు. ఈ వైరస్ సోకినా కానీ కొందరిలో మాత్రం             ఎటువంటి లక్షణాలు కనిపించవు. కొందరిలో మాత్రం తీవ్రమైన శ్వాసవ్యాధులు,         మెదడుకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. తర్వాత 24 గంటల నుంచి           48 గంటల వ్యవధిలో రోగి కోమాలోకి వెళ్తాడు. ఈ వైరస్ సోకకుండా జాగ్రత్త తీసుకోవడం తప్ప చికిత్స లేదు. నిఫా వైరస్‌ను గుర్తించేందుకు కూడా ఆర్టీ పరీక్షనే నిర్వహిస్తారు. పాలిమరైజ్ చైన్ రియాక్షన్ పరీక్షతోనూ కచ్చితమైన సమాచారం           తెలుస్తుంది.