calender_icon.png 9 February, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చక్రాసనంతో చక్కగా..

09-02-2025 12:09:58 AM

చక్కగా ఉండాలంటే చక్రాసనం వేయాలంటున్నారు యోగా నిపుణు లు. యవ్వనం మొదలుకుని.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఒత్తిడిని తగ్గించుకోవడంలో ఈ ఆసనం అనేక ప్రయోజనాలు ఇస్తుంది. ఈ ఆసనంలో శరీరం చక్రం ఆకారంలో ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే దీనికి ఈ పేరు పెట్టారు. చక్రాసనం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. 

ఎలా చేయాలి

యోగాలోని చక్రాసనం వేయడానికి మొదట వెల్లకిలా పడుకోవాలి. తర్వాత కాళ్ళు మడిచి, చేతులను భుజా ల కిందుగా ఆనించి, కొద్దిగా శ్వాస పీల్చి కుంభించి నడుమును వీలైనంత పైకి ఎత్తాలి. మెడ కిందికి వేలాడుతుండాలి. కొద్ది క్షణాలు ఈ స్థితిలో ఉన్న తర్వాత మెల్లమెల్లగా తలను నేలపై ఆనించి నడుమును కూడా ఆనించాలి. దీని తర్వాత కొద్ది క్షణాల సేపు శవాసనం వేసి విశ్రాంతి తీసుకోవాలి.

బెనిఫిట్స్

చక్రాసనాన్ని మీరు ఇంట్లోనే సులభంగా చేసేయొచ్చు. మీరు ఇంట్లోనే ఎక్సర్‌సైజ్ చేసేవారైతే.. కచ్చితంగా దీని ని రోజువారి దినచర్యలో భాగం చేసుకోండి. ఇది శరీరంలో ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది.