calender_icon.png 28 November, 2024 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌ఐసీ కంపెనీ చేతికి ధరణి

09-10-2024 02:07:55 AM

రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి  

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): ధరణి పూర్తి కావొచ్చిందని, ఎన్‌ఐసీ కంపెనీకి ధరణిని అప్పగించినట్లు వ్యవసా య కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి చెప్పారు. దేశంలో సంస్కరణలు అవసరమని, రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ ఎప్పుడు మో సం చేయలేదని ఆయన అన్నారు. ఓట్ల కోస మే కేసీఆర్ ధరణి తీసుకొచ్చారని ఆయన విమర్శించారు.

మంగళవారం ఆయన ఫతే మైదాన్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ రైతులకు ఏక కాలంలో రూ. 2 లక్షల వరకు రుణమాఫీని తెలంగాణ ప్రభుత్వమే చేసిందని, దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఈ స్థాయిలో రుణమాఫీ చేయలేదని  అన్నారు. రుణమాఫీపై  బీజేపీ, బీఆర్‌ఎస్ విషప్రచా రం చేస్తున్నాయని మండిపడ్డారు.

సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ కాలేదని, అర్హులైన రైతులు రుణమాఫీకి దరఖా స్తు పెట్టుకోవాలని సూచించారు. 32 అంశాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ గుర్తించిందని, 6 లక్షల దరఖాస్తులను పరిష్కరించామని తెలిపారు.

చిన్న వర్షానికే హైదరాబాద్ మునిగిపోతుందని, అందుకే చెరువుల పరిరక్షణతో పాటు మూసీ సుందరీకరణను ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. మూసీ ప్రక్షాళన కోసమే కేంద్ర మంత్రి అమిత్‌షాను సీఎం కలిశారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా ఉండి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌కు చేసిందేమి లేదని విమర్శించారు.