calender_icon.png 19 April, 2025 | 7:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాణాపై ఎన్‌ఐఏ ప్రశ్నల వర్షం

12-04-2025 12:00:00 AM

  1. ఎన్‌ఐఏ ప్రధాన కార్యాలయంలో విచారణకు ప్రత్యేక గది
  2. 2008 ముంబై దాడులు, లష్కరే తోయిబా, ఐఎస్‌ఐతో సంబంధాలపై ఎన్‌ఐఏ ప్రశ్నలు 
  3. పటిష్ఠ భద్రత నడుమ రాణా
  4. సెల్‌లోకి వెళ్లేందుకు కేవలం 12 మంది అధికారులకు మాత్రమే అనుమతి
  5. ఆ ఉగ్రవాదులకు పాక్ అత్యున్నత పురస్కారాలు ఇవ్వాలన్న రాణా

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ముంబై ఉగ్రదాడుల కీలక సూత్రధారి తహవూర్ హుస్సేన్ రాణా (64)కు ఢిల్లీలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు 18 రోజుల ఎన్‌ఐఏ కస్టడీ విధించింది. దీంతో అతడిని  ఢిల్లీలోని ఎన్‌ఐఏ ప్రధాన కార్యాలయానికి విచారణ నిమిత్తం అధికారులు తరలించారు. అక్కడ రాణా కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేశా రు. 24 గంటలు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉం డేలా ఆ గదిని రూపొందించారు.

కేవలం 12 మం ది మాత్రమే లోపలికి అనుమతించనున్నారు. గురువారం అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ఎన్‌ఐఏ రాణాను భారత్‌కు తీసుకొచ్చింది. అనంతరం పటియాల హౌస్ కోర్టుకు తరలించగా.. ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయమూర్తి చందర్‌జిత్ సింగ్ 18 రోజుల కస్టడీ విధిస్తూ తీర్పు వెలువరించారు.

రాణాను 20 రోజులు తమ కస్టడీకి అప్పగించాలని ఎన్‌ఐఏ కోరగా.. న్యాయమూర్తి 18 రోజులు కస్టడీకి అనుమతించారు. సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ మాన్ ఎన్‌ఐఏ తరఫున కోర్టులో వాదనలు వినిపించగా.. రాణా తరఫున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యాయవాది పీయూష్ సచ్‌దేవా వాదనలు వినిపించారు. 

భారతీయులకు అలా కావాల్సిందే.. 

2008 ముంబై ఉగ్రదాడుల గురించి సహచర ఉగ్రవాది డేవిడ్ హెడ్లీతో రాణా సంభాషిస్తూ భా రతీయులకు అలా కావాల్సిందే అని అన్నట్లు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ పేర్కొంది. ఆ నాటి ఘటనలో మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆరుగురు అమెరికన్లు కూడా ఉన్నారు.

ఆ నరమేధంలో పాల్గొన్న లష్కరే ఉ గ్రవాదులకు ‘నిషాన్-ఈ-హైదర్’ (పాక్‌లో అ త్యున్నత మిలటరీ అవార్డు) ఇవ్వాలని రాణా  అన్నట్లు యూఎ స్ సంస్థ తెలిపింది. భారత భద్రతా బలగాలు దా డుల సమయంలో తొమ్మిది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టగా.. ప్రాణాలతో దొరికిన కసబ్‌కు న్యాయస్థానం 2012లో ఉరిశిక్ష విధించింది. 

24 గంటల నిఘా

తహవూర్ రాణాను ఢిల్లీలోని సీజీవో కాంప్లెక్స్‌లో ఉన్న ఎన్‌ఐఏ బిల్డింగ్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంచారు. 14x14 అడుగుల వైశాల్యంలో ఉన్న చిన్న గదిలో 24 గంటల నిఘా నడుమ రాణా ఉండేలా ఏర్పాట్లు చేశారు. రాణా ఉన్న గదిలోనే బాత్రూమ్ సౌకర్యం ఉంది. ఆహారంతో పాటు వై ద్య సదుపాయాలు కూడా అక్కడికే వస్తాయని స మాచారం. రాణా కదలికలను ఎప్పటికప్పుడు ప ర్యవేక్షిస్తూ ఉంటారు.

కేవలం 12 మంది ఎన్‌ఐఏ అధికారులు మాత్రమే లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉంది. ఢిల్లీ పోలీసులు, పారా మిలటరీ బల గాలు భవనం చుట్టూ గస్తీ కాస్తున్నాయి. రాణాను ప్రశ్నించేందుకు ఎనిమిది కేంద్ర దర్యాప్తు సంస్థలు అనుమతి కోరినట్టు తెలుస్తోంది. ఎన్‌ఐఏ దర్యా ప్తు బృందానికి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ జయ రాయ్ నేతృత్వం వహిస్తున్నారు.

ఆమె నేతృత్వంలోనే శుక్రవారం నుంచి ఎన్‌ఐఏ అధికారులు రా ణాను ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ కేసులో ఆమే చీఫ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. ప్ర స్తుతం ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్న రాణాను ముంబై దాడులు, లష్కరే తోయిబా, ఐఎస్‌ఐతో లింకు లు, సహచర ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ గురించి ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.