10-04-2025 07:24:36 PM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): 26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారి తహవ్వుర్ రాణాను భారత్ కు తీసుకువచ్చినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(National Investigation Agency) ఒక ప్రకటనలో తెలిపింది. పలు కేంద్ర సంస్థల సహకారంతో అమెరికా అధికారులతో సంప్రదింపులు జరిపి రాణాను విజయవంతంగా భారత్ కు రప్పించామని, భారత్-అమెరికా ఒప్పందంతో తీసుకువచ్చామని ఎన్ఐఏ పేర్కొంది. పలు ఉగ్రవాద సంస్థలతో కలిసి ముంబయి ఉగ్రదాడికి రాణా కుట్ర చేశాడని, పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థలతో చేతులు కలిపాడన్నారు. 2008లో జరిగిన ముంబయి మారణహోమంలో 166 మంది చనిపోయారని ఎన్ఐఏ స్పష్టం చేసింది.