calender_icon.png 6 January, 2025 | 5:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంధ్య ఘటనపై విచారణకు ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశం

02-01-2025 02:17:58 AM

  1. డీజీపీ, హైదరాబాద్ సీపీకి నోటీసులు 
  2. నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ ఆవరణలో తొక్కిలాసట చోటచేసుకుని, రేవతి అనే మహిళ మృతిచెందిన ఘటనపై న్యాయవాది రామారావు ఇచ్చిన ఫిర్యాదుకు బుధవారం జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) స్పందించింది.

ఘటనపై వివరణ ఇవ్వాలని తెలంగాణ డీజీపీ జితేందర్‌తో పాటు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌కు నోటీసులు జారీ చేసింది. సీనియర్ ర్యాంక్ అధికారితో ఘటనపై విచారణ జరిపించి, నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. పోలీసుల లాఠీచార్జి వల్లే రేవతి మృతిచెందిందని న్యాయవాది ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం.

మరోవైపు సినీస్టార్ అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్‌పై గురవారం కోర్టు తీర్పు ఇవ్వనున్న సందర్భంలో న్యాయవాది ఫిర్యాదుపై ఎన్‌హెచ్‌ఆర్సీ స్పందించడం చర్చనీయాంశంగా మారింది.