calender_icon.png 19 November, 2024 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాప్రా చెరువుపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ విచారణ!

14-09-2024 02:12:40 AM

  1. హాజరైన ఉన్నతాధికారులు 
  2. న్యాయ వివాదంలో ఉందని వెల్లడి

హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ పరిధిలోని కాప్రా చెరువు కబ్జాకు గురయ్యిందంటూ వచ్చిన ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) యాక్టింగ్ చైర్‌పర్సన్ శుక్రవారం విచారణ చేశారు. కాప్రా చెరువును కబ్జాచేసి పెద్దపెద్ద బిల్డింగులు, వెంచర్లు నిర్మించా రని, దీంతో కాప్రా చెరువు కుంచించుకు పోయిందంటూ రాంచంద్రారావు అనే వ్యక్తి ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. చెరు వు కుంచించుకు పోవడంతో భూగర్భ జలా లు తగ్గిపోయాయని పేర్కొన్నారు.

ఈ చెరువుపై ఆధారపడి జీవితాన్ని వెళ్లదీస్తున్న మత్స్యకారుల జీవననోపాధి దెబ్బతిందని, చెరువుని ఆక్రమించుకుని నిర్మాణాలు చేయడంతో కాలుష్యం పెరిగిపోయిదని, దీనితోపాటు ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తుతోందని వివరి స్తూ ఫిర్యాదు చేశారు.దీంతో దిల్‌కుషా గెస్ట్‌హౌజ్‌లో ఎన్‌హెచ్‌ఆర్‌సీ యాక్టింగ్ చైర్‌పర్స న్, ఇతర సభ్యులు, ఉన్నతాధికారులు శుక్రవా రం చేపట్టారు.  విచారణకు నీటిపారుదల శాఖ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, మేడ్చల్ కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వచ్చిన ఫిర్యాదులోని అంశాలవారీగా ఎన్‌హెచ్‌ఆర్‌సీ యాక్టింగ్ చైర్‌పర్సన్ ఆయా శాఖల ఉన్నతాధికారుల నుంచి సమాచారాన్ని తెలుసుకున్నట్టు సమాచారం. కాప్రా చెరువును రెండుగా విభజిస్తూ ప్రైవేటు వ్యక్తులు వేసిన రోడ్డు గురించి ఎన్‌హెచ్‌ఆర్‌సీకి వివరించినట్టు తెలుస్తుంది. అలాగే చెరువు బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్‌పై సమాచారాన్ని సేకరించినట్టు సమా చారం. అయితే ప్రస్తుతం ఈ అంశంపై హైకోర్టులో కొందరు పిటిషన్ వేశారని, దాని పై విచారణ జరుగుతోందనే అంశాన్ని ఎన్‌హెచ్‌ఆర్‌సీ దృష్టికి అధికారులు తీసుకెళ్లినట్టు తెలుస్తుంది.