calender_icon.png 24 November, 2024 | 8:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంగారెడ్డి జైలులో లగచర్ల రైతులను విచారించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ

24-11-2024 07:15:42 PM

సంగారెడ్డి,(విజయక్రాంతి): ఇటీవల వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామస్తులు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై చేసిన దాడి ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకుంది. ఈ వివాదంపై సంగారెడ్డి కేంద్ర కారాగారానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం ఆదివారం వెళ్లింది. లగచర్ల ఘటనలో జైల్లో ఉన్న రైతులను కలిసి వారి వివరాలు తెలుసుకున్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రతినిధులు సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఏ2 సురేష్ తో పాటు మరో 19 మంది ఉన్నట్లు గుర్తించింది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ డీప్యూటీ రిజిస్ట్రార్ ముఖేశ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులు, వికారాబాద్ జిల్లా అధికారులు పాల్గొన్నారు. దాదాపు 5 గంటల పాటు సాగిన ఈ విచారణ మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉంది.