calender_icon.png 24 October, 2024 | 9:52 AM

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి

29-07-2024 01:10:10 AM

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు డిమాండ్

మంచిర్యాల, జూలై 28 (విజయక్రాంతి) : ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు డిమాండ్ చేశారు. ఆదివారం సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్‌హెచ్‌ఎంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని, వారిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర న్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా, దేవనబోయిన బాపు యాదవ్, ఖలేందర్, మహేందర్, శరత్ బాబు, అప్సర, సందీప్, సంధ్య, రాణి, దేవా, మహేందర్, రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా మేకల దాసు, జిల్లా అధ్యక్షుడిగా రాజు, ప్రధాన కార్యదర్శిగా దేవనబోయిన బాపు యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం మధుబాబు, వైస్ ప్రెసిడెంట్‌గా రాజ్‌కుమార్, ధనలక్ష్మి, కోశాధికారి ప్రవీణ్య, జాయింట్ సెక్రటరీ జాడి కళావతి, జాయింట్ సెక్రటరీ అప్సర, సభ్యులుగా.. శివ, కీర్తి సుమన్, మురళి, ప్రవళిక తదితరులను ఎన్నుకున్నారు.