calender_icon.png 24 December, 2024 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వచ్చే ఏడాది జనంలోకి కేసీఆర్

02-11-2024 01:48:02 AM

ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు

  1. మాకు మార్గనిర్దేశం చేస్తున్నారు 
  2. మేం తిరిగి అధికారంలోకి వస్తాం
  3. త్వరలో రాష్ర్టవ్యాప్తంగా పాదయాత్ర 
  4. ఎక్స్‌లో కేటీఆర్ ప్రజలతో సంభాషణ 

* కాంగ్రెస్ పాలన ఫ్రమ్ ఢిల్లీ, టు ఢిల్లీ, ఫర్ ఢిల్లీ అన్నట్లుగా తయారైంది. నాలుగు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అధికారం పోవడం ఖాయం. వచ్చే కొత్త ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చేసిన నష్టం నుంచి తేరుకొని ముందుకు తీసుకుపోవడం అతిపెద్ద సవాలు.        

కేటీఆర్ 

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వచ్చే ఏడాది నుంచి ప్రజల్లోకి వచ్చి ప్రభుత్వంపై పోరు చేస్తారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  తెలిపారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని, రోజు పార్టీ నాయకులకు మార్గనిర్దేశం చేస్తున్నా రని ఆయన పేర్కొన్నారు.

బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి సమయం ఇస్తున్నారని చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్న తరువాత వచ్చే అసమ్మతి కారణంగానే తాము ఓడిపోయామన్నారు. మోసపూరిత హామీలతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తున్నదని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు వదిలే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టారు.

గురువారం దీపావళి సందర్భంగా నెటిజన్లతో జరిగిన ఎక్స్ సంభాషణలో పలు అంశాలపై మాట్లాడారు. పార్టీ కార్యకర్తల కోరిక మేరకు భవిష్యత్తులో రాష్ర్టవ్యాప్తంగా పాదయాత్రను నిర్వహి స్తానని స్పష్టం చేశారు. దేశంలోని అనేక పార్టీల నేత లు, ప్రభుత్వాల వైఫల్యాలను ఎండ గట్టడంతోపాటు, పార్టీ బలోపేతం కోసం పార్టీల అధ్యక్షులు పాదయాత్రలు చేస్తున్నారని పేర్కొన్నారు.

మీరెప్పుడు చేస్తారని ఒక నెటిజన్ అడిగినప్పుడు స్పందించిన కేటీఆర్, కచ్చితంగా తన పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు. దాదాపు గంటన్నరపాటు సాగిన ఈ సంభాషణలో అనేక అంశాలపై తన అభిప్రాయా లను కేటీఆర్ ప్రజలతో పంచుకున్నారు. 

తెలంగాణకు రేవంత్ సర్కార్ శాపం..

తెలంగాణకు కాంగ్రెస్ పాలన ఒక శాపం గా మారిందని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఉద్దేశాలు ఏమాత్రం లేవని, అందుకే అబద్దాలు, అసత్యాల మీద సమ యం గడుపుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పదినెలల కాలంలో కాంగ్రెస్ చేసిన ఒక్క మంచి కూడా గుర్తుకు రావడం లేదన్నారు.

తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ వేధింపులను ప్రారంభించిందని, వీటికి తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ పాల న ఫ్రమ్ ఢిల్లీ, టు ఢిల్లీ, ఫర్ ఢిల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు. నాలుగు సం వత్సరాల తర్వాత కాంగ్రెస్ అధికారం పోవ డం ఖాయమని, వచ్చే కొత్త ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చేసిన నష్టం నుంచి తేరుకొని ముందుకు తీసుకుపోవడం అతిపెద్ద సవాలుగా మారుతుందన్నారు. 

రాజకీయాలు వదిలేయాలనుకున్నా.. 

ప్రధాన ప్రతిపక్ష బాధ్యతలు నిర్వహించడంపై దృష్టి సారించామని కేటీఆర్ చెప్పా రు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుతోపాటు తీసుకున్న నిర్ణయాలలో పారదర్శ కతపై ప్రజల తరఫున కొట్లాడుతామని పేర్కొన్నారు.

ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని రాజ్యాంగబద్ధంగా మార్చే అవకాశం ఉన్నదా అని ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మరో నాలుగు సంవత్సరాలు వేచి ఉండాల్సిందేనని తెలిపారు. అయితే ప్రజలు ఐదు సంవత్సరాల కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారని, దానిని మనం గౌరవించా ల్సిన అవసరం ఉందన్నారు. అదే విధంగా రాజకీయాల్లోకి కుటుంబాలను లాగడం నీచమైన ప్రవర్తన అని అన్నారు.

దాదాపు రెండు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో కుటుంబ సభ్యులను అవహేళన చేసి మాట్లాడినప్పుడు, రాజకీయాలు వదిలేయాల న్నంత భావోద్వేగానికి గురైన విషయాన్ని  ప్రస్తావించారు. కేవలం రాజకీయాల కోసం ఇతరుల కుటుంబ సభ్యులను ఎందుకు లాగుతారో అర్థం కాదని, ఈ విషయం తనకు అత్యంత బాధ కలిగిస్తుందన్నారు. 

మూసి లూటిఫీకేషన్‌కు వ్యతిరేకం..

మూసి బ్యూటిఫికేషన్‌కు మేము వ్యతిరేకం కాదని, మూసి లూటిఫీకేషన్‌కు వ్యతిరేక మని అన్నారు. మూసీ ప్రక్షాళణ దేశంలోనే అతిపెద్ద అవినీతి కుంభకోణం అవుతోందని  ఆరోపించారు. హైడ్రా కేవలం కొందరిని మాత్రమే లక్ష్యంగా చేసుకొని పనిచేస్తుందని,  ఇప్పటిదాకా ఒక్క పెద్ద బిల్డర్‌ని కూడా హైడ్రా ముట్టుకోలేదు, కేవలం పేదలను మధ్యతరగతి ప్రజలను మాత్రమే వేదించిందని విమర్శించారు.

ఎన్నికల్లో ఓటమి తర్వాత సామాజిక మాధ్యమాల్లో పార్టీ మద్దతుదారులు ప్రపంచవ్యాప్తంగా బాగా యాక్టివ్‌గా మారారన్నారు. పార్టీ తరఫున ఏం ఆశించకుండానే అద్భుతంగా పనిచేస్తున్నారని, వారి మద్దతును పార్టీకి సోషల్ మీడియా వారియర్లు అందిస్తున్నారన్నారు.

తమ పార్టీ కార్యకర్తలపైన రెచ్చిపో తున్న పోలీస్ అధికారులను గుర్తుపెట్టుకుంటామని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై చట్టపరంగా కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించా రు. నగరంలో నెల రోజులపాటు ఎలాంటి కారణం లేకుండా 144 సెక్షన్ విధించడం షాక్‌కు గురి చేసిందని వ్యాఖ్యానించారు. 

చీకటి ఒప్పందాలు..

రాష్ర్టంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం ఉందని, అనేక అంశాలు రెండు పార్టీల నాయకులు కుమ్మక్కై పనిచేస్తున్న విషయం ప్రజలందరికీ అర్థమవుతుందని ఆయన విమర్శించారు. మహారాష్ర్ట ఎన్నికల్లోను జాతీయ పార్టీలను ప్రజలు నమ్మవద్దని, అక్కడి స్థానిక పార్టీలకు ఓటు వేయాలని కోరారు.

తమిళనాడులో విజయ్ దళపతి ప్రారంభించిన రాజకీయ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయపరమైన అంశాల పట్ల విభేదాలే తప్ప టీడీపీ, వైసీపీ అగ్ర నాయకులందరితో వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉన్నదని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు.

ప్రతిపక్షంలో ఉండే అవకాశంతో తమకు నిబద్ధత కలిగిన, బలమైన నూతన నాయకత్వాన్ని తయారుచేసుకునే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. పార్టీ మారిన 10 మంది అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు తప్పవని అన్నారు.

ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశం బీజేపీ చేస్తున్న మరొక జుమ్లా అయి ఉంటుందని, వారు తీసుకువచ్చే చట్టం ఎలాంటిదో చూడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రూప్ వన్ అభ్యర్థులకు తన పూర్తి మద్దతు ఉంటుందని, యువతకు కాంగ్రెస్  ఇచ్చిన హామీల అమలుపై రాష్ర్ట ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ వెల్లడించారు.