calender_icon.png 31 October, 2024 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వచ్చేవారం ఐపీవోల జాతర

23-06-2024 01:35:10 AM

  • మెయిన్ బోర్డు విభాగంలో రెండు, ఎస్‌ఎంఈ విభాగంలో ఏడు ఆఫర్లు 

ఈవారం 11 లిస్టింగ్‌లు

ముంబై, జూన్ 22: లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రైమరీ మార్కెట్లో పబ్లిక్ ఆఫర్ల జోరు పుంజుకుంటున్నది. వచ్చేవారం దాదాపు 9 ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు (ఐపీవోలు) ప్రారంభంకానున్నాయి. ఇందులో అలైడ్ బ్లెండర్స్, వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్‌లు మెయిర్‌బోర్డు విభాగంలో ఆఫర్లు జారీచేస్తున్నాయి. ఎస్‌ఎంఈ విభాగంలో మొత్తం ఏడు ఐపీవోలు వస్తున్నాయి. ఎస్‌ఎంఈ విభాగంలో విసామాన్ గ్లోబల్ సేల్స్, మాసన్ ఇన్‌ఫ్రాటెక్, స్లివన్ ప్లేబోర్డ్, శివాలిక్ పవర్ కంట్రోల్, పెట్రో కార్బన్ అండ్ కెమికల్స్, డివైన్ పవర్, అకియో గ్లోబల్ సర్వీస్‌లు ఆఫర్లను తెస్తున్నాయి.

ఈ ఐపీవోలతో పాటు వచ్చే వారం  స్టాన్లీ లైఫ్‌స్టయిల్స్, డీఈఈ డెవలప్‌మెంట్ ఇంజనీర్స్, ఆక్మే ఫిన్‌ట్రేడ్‌లతో సహా 11 కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. గతవారం ఐపీవోలకు వచ్చిన డీఈఈ డెవలప్‌మెంట్ ఇంజనీర్స్, ఆక్మే ఫిన్‌ట్రేడ్‌లకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. డీఈఈ డెవలప్‌మెంట్ ఇంజనీర్ 99 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రయిబ్‌కాగా, ఆక్మే ఫిన్‌ట్రేడ్ 55 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయ్యింది. ఈ వారం ఇష్యూల్లో ప్రధానమైనవి...

అలైడ్ బ్లెండర్స్: ఆఫీసర్స్ ఛాయస్ విస్కీ తయారుచేసే అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ తన ఐపీవో ధరల శ్రేణిని షేరుకు రూ.267 నిర్ణయించింది. ఈ కంపెనీ రూ. 1,500 కోట్ల నిధుల సమీకరణకు ఆఫర్ జారీచేస్తున్నది. రూ. 1,000 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను విక్రయిస్తుండగా, ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూపంలో మరో రూ. 500 కోట్ల విలువైన షేర్లను ఆఫ్‌లోడ్ చేస్తారు. సమకూరిన నిధుల్లో రూ. 720 కోట్ల రుణాల చెల్లింపునకు కంపెనీ ఉపయోగిస్తుంది. మిగిలిన నిధుల్ని కార్పొరేట్ అవస రాలకు వాడుతుంది.  ఐపీవో జూన్ 25న ప్రారంభమై 27న ముగుస్తుంది.

వ్రజ్ ఐరెన్ అండ్ స్టీల్ : ఈ కంపెనీ ఐపీవో జూన్ 26న ప్రారంభమై 28న ముగుస్తుంది. రూ.171 కోట్ల సమీకరణకు జారీఅవుతున్న ఆఫర్ ప్రైస్‌బ్యాండ్‌ను రూ.195 వద్ద నిర్ణయించింది. బిలాస్‌పూర్‌లో ప్లాంట్ విస్తరణ కోసం రూ.1 64.50 కోట్లు వినియోగించాలని, మిగిలిన మొత్తాన్ని కార్పొరేట్ అవసరాలకు ఉంచుకోవాలని కంపెనీ ప్రతిపాదించింది.