హుజురాబాద్ ఎసిపి శ్రీనివాస్...
హుజురాబాద్ (విజయక్రాంతి): ప్రజలకు పత్రికలు వారిదిగా పని చేయాలని హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ఎసిపి కార్యాలయంలో బుధవారం విజయక్రాంతి క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయి అన్నారు. నిజాలు ఎప్పటికప్పుడు వెలికితీస్తూ ప్రజలకు పత్రికలు అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ విజయక్రాంతి ఆర్సి ఇంచార్జ్ నిమ్మటూరి సాయికృష్ణ, టియుడబ్ల్యూజే ఐజేయు కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు నంబిని భరణి కుమార్, శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.