calender_icon.png 19 October, 2024 | 12:01 PM

ఐటీఆర్ గడువు పొడిగింపు వార్తలు అవాస్తవం

23-07-2024 12:05:00 AM

  • ఆదాయపు పన్ను శాఖ

న్యూఢిల్లీ, జూలై 22: ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు గడువును ఆగస్టు 31వరకూ పొడిగించినట్టు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న వార్తలు ఆవాస్తవమని ఆదాయపు పన్ను శాఖ సోమవారం తెలిపింది. అలాగే ఐటీ రిఫండ్స్‌లో కుంభకోణం జరిగిందంటూ ప్రచారంలో ఉన్న వార్తల పట్ల కూడా పన్ను చెల్లింపుదారులను హెచ్చరించింది. గడువుతేదీని ఆగస్టు 31కి పొడిగిం చినట్టు గుజరాత్‌లో సందేశ్‌న్యూస్ వార్తపత్రికలో ప్రచురితమైన ఒక తప్పుడు వార్త క్లి ప్పింగ్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నదని, 2023 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేసేందుకు జూలై 31 గడువు తేదీ అని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. గడువుతేదీలోపు రిటర్న్ ఫైల్ చేయ కపోతే, ఆలస్య రుసుమే కాకుండా మరింత భారం పడుతుందని ట్యాక్స్‌పేయర్లను హెచ్చరించింది. సరైన సమాచారాన్ని ఇన్‌కమ్ ట్యాక్స్ ఇండియా అధికారిక వెబ్‌సైట్/పోర్టల్ నుంచి తెలుసుకోవాలని సూచించింది.