04-04-2025 12:51:22 AM
మాతా శిశు ఆసుపత్రికి చేరుకున్న 35 లక్షల విలువ గల పరికరాలు
పెద్దపల్లి , ఏప్రిల్- 3(విజయక్రాంతి): త్వరలోనే పెద్దపల్లి మాతా శిశు ఆసుపత్రిలో నవ జాత శిశు కేంద్రం ప్రారంభించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. గురువారం పెద్దపల్లి పట్టణంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. మాత శిశు సంరక్షణ కేంద్రంలో నవజాత శిశు కేంద్రం ఏర్పాటుకు వచ్చిన పరికరాలను కలెక్టర్ పరిశీలించారు.
ఐఓసిఎల్ సంస్థ వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్‌ఆర్) క్రింద వార్మర్స్ ,డబుల్ సర్ఫర్ ఫోటో థెరపీ, ఆటోక్లేవ్ ,సక్షన్ అపారేటస్ బబ్ల్ సి పాప్, వెంటిలేటర్ ఇన్ఫుశాన్ పంప్, సిరంజ్ పంప్ పొర్టబుల్ X రే వంటి పరికరాలను అందించారని కలెక్టర్ తెలిపారు.
నవజాత శిశు కేంద్రం ఏర్పాటుకు అవసరమైన 35 లక్షల విలువ చేసే వివిధ వైద్య పరికరాలు మాత శిశు ఆసుపత్రికి చేరుకున్నాయని, వీటిని త్వరగా అమర్చి నవ జాత శిశు కేంద్రం ప్రారంభానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి, పిల్లల వైద్య నిపుణులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.