calender_icon.png 9 January, 2025 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో నవజాత శిశువు మృతి

09-01-2025 10:56:36 AM

వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని అంటున్న బంధువులు

కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో ఘటన

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో నవజాత శిశువు మృతి చెందిన ఘటన గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో గురువారం తెల్లవారుజామున నవ జాత శిశువు జన్మించిన కాసేపటికే మృతి చెందిన ఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రానికి చెందిన భవానికి బాన్సువాడ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సాయిలుతో గతంలో వివాహమైంది. భవాని కి బుధవారం మధ్యాహ్నం పురిటి నొప్పులు రావడంతో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి ప్రసవం కోసం కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు.

పరీక్షించిన వైద్యులు సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించారు. కుటుంబ సభ్యులు ఆపరేషన్ చేయాలని వేడుకున్నా వినిపించుకోలేదు. నొప్పులు ఎక్కువ కావడంతో గురువారం తెల్లవారుజామున 4 గంటలకు ఆపరేషన్ చేయగా ఆడపిల్ల జన్మించింది. మొదటి కాన్పులో మహాలక్ష్మి పుట్టిందని సంతోషించే లోపే శిశువు మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. తాము చెప్పినట్టుగా బుధవారమే ఆపరేషన్ చేసి ఉంటే బిడ్డ బతికేదని, వైద్యుల నిర్లక్ష్యంతో బిడ్డను చంపేశారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యం పై మండిపడ్డారు. నిర్లక్ష్యం చేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు వచ్చి నవజాత శిశువు కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆందోళన చేయకుండా అడ్డు కు ని చెప్పారు. గైనిక్ వైద్యుల కొరత కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో నెలకొంది. సరైనటువంటి గైనిక్ వైద్యులు లేక వైద్యంలో నిర్లక్ష్యం జరుగుతుందని స్థానికులు ఆరోపించారు. ఆస్పత్రికి అవసరమైన డైనిక్ వైద్యులను నియమించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.