calender_icon.png 9 January, 2025 | 2:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండో వన్డేలో న్యూజిలాండ్ విజయం

08-01-2025 11:18:22 PM

డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో...

హామిల్టన్: సొంతగడ్డపై శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్ మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే 2 కైవసం చేసుకుంది. బుధవారం హామిల్టన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో కివీస్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 113 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ను 37 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 37 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (63 బంతుల్లో 79), మార్క్ చాప్‌మన్ (52 బంతుల్లో 62) అర్థసెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో తీక్షణ 4 వికెట్లు తీయగా.. హసరంగ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 256 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన శ్రీలంక 30.2 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. కమిందు మెండిస్ (64) అర్థసెంచరీతో మెరిసినప్పటికీ మిగతావారు విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో విలియం రూర్కీ 3 వికెట్లు, జాకబ్ డఫీ 2 వికెట్లు పడగొట్టారు. రచిన్ రవీంద్రకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ లభించింది. ఇరుజట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే శనివారం జరగనుంది.