శ్రీలంకపై 8 పరుగులతో విజయం...
మౌంట్ మాంగనూయ్: సొంతగడ్డపై శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్ 8 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (42 బంతుల్లో 62) టాప్ స్కోరర్‌గా నిలవగా.. చివర్లో మైకెల్ బ్రాస్‌వెల్ (33 బంతుల్లో 59) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. లంక బౌలర్లలో ఫెర్నాండో, తీక్షణ, హసరంగ తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులకు పరిమితమైంది. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక (60 బంతుల్లో 90), కుసాల్ మెండిస్ (46) రాణించినప్పటికీ మిగతావారు విఫలమవ్వడంతో లంక ఓటమిని మూటగట్టుకుంది. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ 3 వికెట్లు తీయగా.. ఫౌల్క్స్, మాట్ హెన్రీ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఇరుజట్ల మధ్య రెండో టీ20 సోమవారం జరగనుంది.