06-03-2025 01:08:37 AM
లాహోర్: ప్రతిష్ఠాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం జరగనున్న ఫైనల్లో భారత్‌తో న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనుంది. బుధవారం లాహోర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్లో న్యూజి లాండ్ 50 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోరు చేసింది.
రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (102) శతకాలతో చెలరేగారు. సఫారీ బౌలర్లలో ఎన్గిడి మూడు వికె ట్లు తీయగా.. రబాడ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులకు పరిమితమైంది. మిల్లర్ (100 నాటౌట్), డసెన్ (69), బవుమా (56) రాణించారు.
కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 3 , హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్ చెరో 2 వికెట్లు తీశారు. కాగా న్యూజిలాండ్ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అడుగుపెట్టడం ఇది మూడోసారి. 2000 లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ను ఓడించి టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే.