షార్జా: మహిళల టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ తుది పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం షార్జా వేదికగా వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్‌లో కివీస్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. జార్జియా (33) టాప్ స్కోరర్. విండీస్ బౌలర్లలో డొతిన్ 4 వికెట్లతో రాణించింది.
అనంతరం లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ ఓవర్లలో ౮ వికెట్లు కోల్పోయి ౧౨౦ పరుగులకు పరిమితమైంది. డొత్తిన్ (33) రాణించింది. కివీస్ బౌలర్లలో కార్సన్ 3 వికెట్లు తీయగా.. అమేలి 2 వికెట్లు పడగొట్టింది. పొట్టి ప్రపంచకప్ ఫైనల్లో మూడోసారి అడుగుపెట్టిన కివీస్ ఆదివారం సౌతాఫ్రికాతో తలపడనుంది. ఎవరు గెలిచినా వారికిదే తొలి ప్రపంచకప్ టైటిల్ కానుంది.