calender_icon.png 19 April, 2025 | 7:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

168 కోట్ల నష్టపరిహారం చెల్లించండి

11-04-2025 11:49:10 PM

హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ టోబాక్‌కు న్యూయార్క్ జ్యూరీ ఆదేశం..

మూడున్నర దశబ్దాలుగా 40 మంది మహిళలపై లైంగిక వేధింపులు..

న్యూయార్క్: లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు, రచయిత జేమ్స్ టోబాక్‌కు న్యూయార్క్ జ్యూరీ షాకిచ్చింది. తన వద్దకు వచ్చిన 40 మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు 168 కోట్ల (1.68 బిలియన్ డాలర్లు) నష్టపరిహారం చెల్లించాలని జేమ్స్ టోబాక్‌ను జ్యూరీ ఆదేశించింది. ‘బగ్సీ’ సినిమా రచనకు గాను ఆస్కార్ నామినేషన్ అందుకున్న జేమ్స్ టోబాక్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు 38 మంది మహిళలు ఆరోపించడం సంచలనం కలిగించింది. ‘ద లాస్ ఏంజిల్స్ టైమ్స్’ జేమ్స్ టోబాక్ రాసలీలలపై ప్రత్యేక కథనం ప్రచురించింది. న్యూయార్క్ స్ట్రీట్‌లో టోబాక్ తమను కలిసి సినిమాల్లో అవకాశమిస్తానని చెప్పేవాడని బాధితురాళ్లు వాపోయారు.

ఆయనతో సమావేశాలు చాలాసార్లు లైంగిక ప్రశ్నలతో ముగిసేవని, కొన్నిసార్లు తమ ముందే స్వీయ లైంగిక చర్యకు పాల్పడడం చేస్తుండేవాడని తెలిపారు. ఆ తర్వాత బలవంతంగా లైంగిక్ వేధింపులకు గురి చేశాడని ఆరోపించారు. జేమ్స్ టోబాక్ వద్ద గిటారిస్ట్, వోకలిస్ట్‌గా పనిచేసే మహిళలు స్వయంగా జేమ్స్ రాసలీలలను ఆడియో రికార్డులుగా పంపించారని లాస్ ఏంజిల్స్ తన కథనంలో పేర్కొంది. కాగా ఈ కేసులో మొదటి దావా 2022లో మన్‌హట్టన్‌లో నమోదవ్వడంతో జేమ్స్ టోబాక్ లైంగిక వేధింపుల విషయం వెలుగులోకి వచ్చింది. మూడున్నర దశాబ్దాలుగా జేమ్స్ టోబాక్ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు తేలింది. అయితే 73 ఏళ్ల టోబాక్ ఈ ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేసినప్పటికీ ‘లాస్ ఏంజిల్స్ టైమ్స్’ కథనం ప్రచురించడంతో అన్ని దారులు మూసుకపోయినట్టయింది.