బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 31 (విజయక్రాంతి): జనవరి 1న న్యూ ఇయర్ అని బ్రిటీష్ పాలకులు మనపై రుద్ది వెల్లారని, హిందువుల కొత్త సంవత్సరం ఉగాది అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. న్యూ ఇయర్ పేరిట గోవా, పబ్‌లు, క్లబ్‌లకు వెళ్లడమేనా మన సంస్కృతి అని పేర్కొన్నారు.
డిసెంబర్ 31, జనవరి 1న జరిగే ఈవెంట్లతో హిందువులు ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యూ ఇయర్ పేరిట భవిష్యత్ తరాలకు విదేశీ సంస్కృతిని అలవాటు చేయొద్దని.. ఉగాది కొత్త సంవత్సరం అని అలవాటు చేయాలని తల్లిదండ్రులకు సూచించారు.