మహదేవపూర్, జనవరి 1: జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు అంబరాన్ని అంటాయి. జిల్లా కేంద్రంతోపాటు వివిధ మండలాలలో నూతన సంవ త్సర వేడుకలు చర్చిలలో నిర్వహించారు. మహదేవపూర్ మండలంలోని రాపెల్లికోట, బెగ్లూర్ లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. యేసు ప్రేమించుచున్నాడు ప్రార్ధనా మందిరాల లో పాస్టర్స్ జోసఫ్, ప్రకాష్, సురేష్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాస్టర్లు నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు నూత నమైన ప్రణాళికల చేత నూతనమైన విధానంలో ముందుకు సాగాలని, దేవుడు ప్రతి ఒక్కరిపట్ల ఆయన కృపను విస్తరింపజేసి ఈ నూతన సంవత్సరంలో దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి, దేవుని మహా కృపను తోడుగా ఉంచి 2025 సంవత్సరం అంతయు నడిపిస్తాడని వివరిస్తూ, ప్రతి ఒక్కరూ ఈ సంవత్సర మంతయు సంతోషంగా ఆనందంగా ముందుకు సాగాలని కోరు కుంటూ సందేశం అందించారు. అనంతరం నూతన సంవత్సరములో ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించే వాగ్దానాలను తీసుకున్నారు.
కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. తర్వాత జీసస్ లవ్స్ మినిస్ట్రీస్ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను పాస్టర్ జోసెఫ్ - మరియా గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేసి, ప్రతి కుటుంబానికి అందించారు. ఈ నూతన సంవత్సరం 2025లో దేశ, రాష్ర్ట ప్రభుత్వాలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరూ, ప్రజలందరూ సుఖ సంతో షాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ పరిచారు. ఈ కార్యక్రమాలలో రెండు గ్రామాల సంఘ పెద్దలు, స్థానిక విశ్వాసులు గ్రామస్తులు ప్రేయర్ టీం సభ్యులు పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేశారు.