మళ్ళీ అధికారంలోకి వస్తాం.. ఎమ్మెల్సీ తాతా మధు
ఖమ్మం (విజయక్రాంతి): ఖమ్మం బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, బాణోత్ చంద్రావతి, మాజీ జెడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు, పార్టీ నాయకులు, ఉద్యమకారులు తదితరులు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. తాతా మధు కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా తాతా మధు మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటాలు చేసి, మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పారు. రానున్న స్ధానిక ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, మాజీ జిల్లా గ్రంధాలయ సంస్ధ చైర్మన్ ఖమర్, జిల్లా మైనార్టీ నాయకులు తాజుద్దీన్, పార్టీ జిల్లా నాయకులు గుండాల కృష్ణ, ఉద్యమ కారులు ఉప్పల వెంకటరమణ, నాయకులు సామినేని హరిప్రసాద్, కట్టా అజయ్, బెల్లం వేణు, పెంట్యాల పుల్లయ్య, డోకుపర్తి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.