పెద్దపల్లి ఏసిపి జి కృష్ణ యాదవ్...
పెద్దపల్లి (విజయక్రాంతి): నూతన సంవత్సర సంబరాలు(New Year Celebrations) సమస్యలు తీసుకొచ్చే విధంగా ఉండరాదని పెద్దపల్లి ఏసిపి జి కృష్ణ యాదవ్ తెలిపారు. సోమవారం ఏసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నూతన సంవత్సరాన్ని కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా అందరూ జరుపుకోవాలని, అధిక మద్యం సేవించి వాహనాలపై ప్రయాణం చేసి రోడ్డు ప్రమాదాల బారిన పడరాదంటూ సూచించారు. పెద్దపల్లి డివిజన్ పరిధిలో అన్ని సెంటర్లలో రాత్రి 10 గంటల నుండి విస్తృత తనిఖీలు ఉంటాయని ప్రతి ఒక్కరూ మద్యం సేవించి వాహనం నడిపితే చర్యలు తప్పవని త్రిబుల్ రైడింగ్ సైతం కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. యువత తాత్కాలిక ఫీలింగ్ కోసం తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని, నూతన సంవత్సరాన్ని సంతోషంగా, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలంటూ ఏసీపీ కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్, పెద్దపల్లి ఎస్సై లక్ష్మణ్ రావు పాల్గొన్నారు.