calender_icon.png 5 January, 2025 | 3:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యూజిలాండ్‌లో అంబరాన్నంటిన న్యూ ఇయర్ సంబురాలు

31-12-2024 04:56:51 PM

న్యూజిలాండ్,(విజయక్రాంతి): న్యూజిలాండ్‌(New Zealand)లో కొత్త సంవత్సరం వేడుకలు(New Year Celebrations) ఆరంభమయ్యాయి. ఆక్లాండ్(Auckland) ప్రజలు 2024కు గుడ్ బై చెప్పి 2025కు ఘన స్వాగతం పలికారు. నూతన సంవత్సర సంబరాలు ఆక్లాండ్ లో అంబరాన్నంటాయి. న్యూ ఇయర్ సందర్భాంగా ఆక్లాండ్ ప్రజలు బాణసంచా కాల్చి, రోడ్లపైకి వచ్చి కేకులు కట్ చేస్తూ పెద్దఎత్తున్న వేడుకలు జరుపుకుంటున్నారు. టైమ్ జోన్ ప్రకారం ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ముందుగా కిరిబాటి దీవుల(Kiribati Islands) ప్రజలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 31వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటలకు పసిఫిక్ మహాసముద్రం(Pacific Ocean)లోని కిరిబాటి దీవుల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. అనంతరం ఒక గంట వ్యవధిలోనే దక్షిణ పసిఫిక్ లోని టోంగా, సమోవా దీవులు, ఆ తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియాలు కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తాయి.