calender_icon.png 4 January, 2025 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పద్మశాలి సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

01-01-2025 07:36:43 PM

ముఖ్య అతిథులుగా రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వల్లకాటి రాజ్ కుమార్, ఉపాధ్యక్షుడు సాయిని అమృతం

మేడిపల్లి (విజయక్రాంతి): బోడుప్పల్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయిబాబా దేవాలయంలో పద్మశాలి సంఘం 2025 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు వల్లకాటి రాజ్ కుమార్, రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు సాయిని అమృతంలు పాల్గొని క్యాలెండర్ ను తమ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు, ఉపాధ్యక్షులను శాలువాతో సన్మానించారు. రాష్ట్రంలో పద్మశాలీలు ఐక్యంగా ఉండి అభివృద్ధి పదంలో ముందుకు సాగలాన్నారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ పద్మశాలి సంఘం అధ్యక్షులు వి.వెంకట స్వామి, ప్రధాన కార్యదర్శి మధు మోహన్, కోశాధికారి ఓంకార్, సంక్షేమ సంఘం అధ్యక్షులు డి విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి నర్సింగరావు, సలహాదారులు డా.లక్ష్మి వీరమల్లు, సమ్మయ్య, సంఘం యువజన విభాగం అధ్యక్షుడు సాయిని నవీన్, ఉపేందర్, సత్యనారాయణ, విష్ణు, డా. రామచంద్రం, డా.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.