హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయ క్రాంతి): రాష్ట్రంలో మరో 4 మార్కెట్ కమిటీలకు పాలకవర్గాన్ని నియమిస్తూ ఉత్తర్వు లు జారీ చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వీటితో కలిపి మొత్తం 48 ఏఎంసీలకు పాలకవర్గాల నియామకం పూర్తయిందని పేర్కొన్నారు. మిగిలిన ఏఎంసీలకు కూడా కమిటీలను నియమిస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైన థ్ ఏఎంసీ చైర్మన్‌గా అల్లూరి అశోక్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా సవపూరె విలాస్, అచ్చంపేట ఏ ఎంసీ చైర్‌పర్సన్‌గా అంతటి రజిత, వైస్ చై ర్మన్‌గా రసుమొల్ల వెంకటయ్య, పరకాల ఏ ఎంసీ చైర్మన్‌గా చందుపట్ల రాజిరెడ్డి, వైస్ చై ర్మన్‌గా మరపల్లి రవీందర్, ఆలేరు ఏఎంసీ చైర్‌పర్సన్‌గా ఇనాల చైతన్య, వైస్ చైర్మన్‌గా మదర్ గౌడ్‌ను నియమించామన్నారు.