03-04-2025 12:00:00 AM
క్వాంటమ్ శాస్త్ర పరిశోధనకు వంద సంవత్సరాలు పూ ర్తవుతున్న నేపథ్యంలో, ఐక్యరాజ్యసమితి (ఐరాస) 2025ను ‘అంతర్జాతీయ క్వాంటమ్ సైన్స్ టెక్నాలజీ సంవత్సరం’గా ప్రకటించింది. పారిస్‌లోని యునెస్కో కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, ప్రపంచవ్యాప్తంగా 800 మంది శాస్త్రవేత్తలు, పరిశ్రమ నిపుణులు, విధాన నిర్ణేతలు హాజరయ్యారు.
క్వాంటమ్ కంప్యూటింగ్, సురక్షిత సమాచార వ్యవ స్థలు, మెరుగైన ఔషధ రూపకల్పన వంటి రంగాల్లో దీని విప్లవాత్మక ప్రభావంపై చర్చలు జరిగాయి. మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన టోపో కండక్టర్- ఆధారిత చిప్, గూగుల్ రూపొందించిన విల్లో క్వాంటమ్ చిప్ వంటి పురోగతులు, క్వాంటమ్ కం ప్యూటింగ్‌ను ప్రాక్టికల్ స్థాయికి తీసుకువెళ్తున్నాయి.
ఐబీఎం, మైక్రోసాఫ్ట్, ఆక్స్‌ఫర్డ్ క్వాంటమ్ సర్క్యూట్స్, క్వాంటినుం వంటి సంస్థలు క్వాంటమ్ టెక్నాలజీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. క్వాంటమ్ టెక్నాలజీ అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తోంది. క్వాంటమ్ ఎన్‌స్క్రిప్షన్ సాంకేతికతను ఉపయోగించి సమాచార భద్రతను బలోపేతం చేయవచ్చు. ఇది సంకేతం ద్వారా గోప్యతను రక్షించి, సమాచారాన్ని ఎక్కు వ సురక్షితంగా మార్చుతుంది.
అలాగే, క్షిపణి నియంత్రణ వ్యవస్థలు, సురక్షితమైన కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా మెరుగు పడుతున్నాయి. భారత ప్రభుత్వం 2023లో ప్రారంభించిన ‘నేషనల్ క్వాంటమ్ మిషన్’ ద్వారా ఈ రంగంలో విశేష పురోగతి సాధిస్తోంది. 2031 వరకు అమలయ్యే ఈ ప్రణాళిక క్వాం టమ్ కంప్యూటింగ్, కమ్యూనికేషన్, సెన్సింగ్ రంగాల్లో భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ముందంజలో నిలుపనుంది.
విద్యాసంస్థలు, పరిశోధనా కేంద్రాలు, ప్రభుత్వ మద్దతుతో ఈ పరిశోధనలు వేగవంతమవుతున్నాయి. గ్లోబల్ భాగస్వామ్యంతో, భారతదేశం క్వాంటమ్ టెక్నాలజీలో కీలక కేంద్రం గా అభివృద్ధి చెందుతోంది. రానున్న కాలంలో భారతదేశం క్వాంటమ్ టెక్నాలజీలో కీలక కేంద్రంగా ఎదుగుతుంది.