calender_icon.png 6 March, 2025 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరెంటు సమస్య రాకుండా రూ.1.50 కోట్లతో 28 కొత్త ట్రాన్స్ఫార్మర్స్

06-03-2025 08:25:55 PM

ప్రారంభించిన విద్యుత్ శాఖ ఎస్ఈ దామోదర్...

భద్రాచలం (విజయక్రాంతి): కాబోయే వేసవికాలంలో భద్రాచలం పట్టణంలో విద్యుత్ లో ఓల్టేజి సమస్యతో పాటు, ఇతర సమస్యలు రాకుండా ముందుజాగ్రత్తగా చర్యలు తీసుకునేందుకు విద్యుత్ శాఖ అధికారులు విశేష కృషి చేశారు. దానిలో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు రాబోయే కాలంలో ఏఏ కాలనీలో విద్యుత్ సమస్యలు తలెత్తుతాయో ముందుగా గుర్తించి, ఆ సమస్య నివారణకు అవసరమైన ట్రాన్స్ఫార్మర్ కావాలని విద్యుత్ శాఖకు నివేదించారు.

దీంతో విద్యుత్ శాఖ రూ 1.50 కొట్లతో  మంజూరు చేసి 28 కొత్త ట్రాన్స్ఫార్మర్లకు అనుమతి మంజూరు చేసింది. దానిలో భాగంగా గురువారం  12 ట్రాన్స్ఫార్మర్లను వివిధ కాలనీలో ఆయా కాలనీల ప్రజల సమక్షంలో ఏర్పాటు చేసి  విద్యుత్ శాఖ ఎస్సీ దామోదర్ చేతుల మీదుగా ప్రారంభించారు. దీంతో పలు కాలనీవాసులు విద్యుత్ శాఖ అధికారుల కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డి ఇ జీవన్ కుమార్, ఏ డి ఈ వేణు ఏ ఈ రాజారావు లైన్మెన్ శ్రీనాథ్ రెడ్డి విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.