calender_icon.png 27 November, 2024 | 10:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ బ్యాంక్‌ల నుంచి కొత్త సాధనాలు

27-11-2024 12:00:00 AM

బ్యాంకింగ్ కార్యదర్శి 

న్యూఢిల్లీ, నవంబర్ 26: వచ్చే కొద్ది నెలల్లో ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు కొత్త డిపాజిట్, రుణ సాధనాల్ని ప్రవేశపె డతాయని కేంద్ర బ్యాంకింగ్ కార్యదర్శి నాగరాజు తెలిపారు. మంగళవారం ఫిన్‌టెక్ సదస్సు లో మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈలతో సహా అన్ని రంగాలకు రుణ వితరణ పెంచేందుకు కొత్త సాధనాల్ని పీఎస్‌యూ బ్యాంక్‌లు వచ్చే 34 నెలల్లో తీసుకువస్తాయన్నారు.

రుణ లభ్యతను మెరుగుపర్చడానికి ఇప్పటికే ప్రభుత్వం పలు చర్యల్ని తీసుకున్నదని, గత ఫైనాన్షియల్ రికార్డులు లేనివారికి కూడా రుణాలిచ్చే కొత్త మోడల్‌ను బడ్జెట్లో ప్రకటించిన సంగతిని గుర్తుచేశారు.  బ్యాంక్ డిపాజిట్లకు నామినీల సంఖ్యతో సహా పలు అంశాలతో కూడిన బ్యాంకింగ్ సవరణల బిల్లు ఈ పార్లమెంటు సమావేశాల్లో ఆమోదం పొందవచ్చని నాగరాజు  తెలిపారు.