23-03-2025 12:28:47 AM
కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ, మార్చి 22: వినియోగదారుల కోసం సహేతుకమైన రాయితీలతో కూడిన కొత్త టోల్ పాలసీని ఏప్రిల్ 1 కంటే ముందే ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ‘బిజినెస్ టుడే’ నిర్వహించిన మైండ్ రష్ 2025లో ఆయన మాట్లాడుతూ.. ‘భారత్‌లో టోల్ కలెక్షన్స్ పెరుగుతున్నాయి.
2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 64, 809.86 కోట్ల మేర టోల్ వసూలైంది. 2019 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఇది 35 శాతం ఎక్కువ. 2019 ఆర్థిక సంవత్సరంలో రూ. 27,503 కో ట్లు మాత్రమే టోల్ వసూలైంది. భారత్‌లో 65 శాతం మంది గ్రామీణ ప్రాంతా ల్లోనే నివసిస్తున్నారు. వారు జాతీయ ఆర్థిక వృద్ధికి కేవలం 12 శాతం మాత్రమే అందజేస్తున్నారు. మన దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం’ అని గడ్కరీ తెలిపారు.