- ‘ఎంఎంటీఎస్’ వేళల్లోనూ మార్పులు
- నేటి నుంచే అమలు.. ప్రయాణికులు గమనించాలని విజ్ఞప్తి
హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): ఏటా జూలై 1 నుంచి అమలులోకి వచ్చే ట్రైన్స్ ఎట్ ఎ గ్లాన్స్ (టీఏజీ) విధానం 2024లో మారలేదు. దీంతో రైల్వేస్ టైం టేబుల్ ఎప్పుడు మారుతుందా.. అని ప్యాసింజర్స్ ఎదురుచూశారు. రైలు వేళలకు సంబంధించిన టైం టేబుల్‌ను సవరించి, బుధవారం (జనవరి 1) నుంచి రైల్వేశాఖ కొత్త టైం టేబుల్‌ను అమలు చేయనున్నది.
కాబట్టి ప్రయాణికులు ఇంటి నుంచి బయల్దేరే ముందే రైళ్ల రాకపోకలను టైం టేబుల్‌ను ఐర్‌సీటీసీ వెబ్‌సైట్ (https:// www.irctc. gov.in), నేషనల్ ట్రైన్ ఎంక్వురై సిస్టమ్ (ఎన్టీఈఎస్) యాప్‌లో చెక్ చేసుకోవాలని సూచిస్తున్నది. లేదా ఆయా రైల్వే స్టేషన్లలోని స్టేషన్ మేనేజర్/ విచారణ కేంద్రంలో సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నది.
ద.మ.రైల్వే పరిధిలోనూ కొత్త టైం టేబుల్ అమలయ్యే అవకాశం ఉందని రైల్వేశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. అలాగే హైదరాబాద్ నగరంలో ప్రయాణికులకు రవాణా సేవలందిస్తున్న 88 ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకల వేళల్లోనూ మార్పులు ఉండొచ్చని చెప్తున్నారు.
మార్పులను నేషనల్ ట్రైన్ ఎంక్వురై సిస్టమ్ (ఎన్టీఈఎస్) యాప్ లేదా సంబంధిత రైల్వే స్టేషన్ల పరిధిలో స్టేషన్ మేనేజర్/విచారణ కేంద్రం ద్వారా తెలుసుకోవాలని సూచించారు. ప్రధానంగా సికింద్రాబాద్- మేడ్చల్, ఫలక్‌నుమా- ఉందానగర్, ఘట్‌కేసర్- లింగంపల్లి మధ్య రైళ్ల రాకపోకల వేళలు మారినట్లు వెల్లడించారు.