సగం జిల్లాల్లోని టీచర్లకు జమకాని జీతాలు
జాయినింగ్ డేట్‌పై వీడని సందిగ్ధత
హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): డీఎస్సీ ద్వారా నియమితు లైన ఉపాధ్యాయులకు ఇంతవరకూ వేతనా లు అందలేదు. వారికి రెండు నెలల వేతనా లు రావాల్సి ఉన్నా ఇప్పటికీ జమకాలేదు. దాదాపు 20 జిల్లాల్లోని ఉపాధ్యాయులకు వేతనాలు అందలేదని సమాచారం. సోమ, మంగళవారం వరకు 10 జిల్లాల్లోని కొత్త టీ చర్లకు జమైనట్లు తెలిసింది. జాయినింగ్ డేట్ విషయంలో సందిగ్ధత నెలకొనడంతో వేతనాల విడుదల్లో జాప్యం ఏర్పడింది.
కొత్త టీచర్లకు అక్టోబర్ 10 నుంచి వేతనాలిస్తామ ని విద్యాశాఖ అధికారిక వర్గాలు ప్రకటించడంతో ఆ తేదీతోనే అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. కానీ ఆర్డర్లు ఇచ్చిన వారం తర్వాత జిల్లాల్లో కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇచ్చారు. అక్టోబర్ 16 నుంచి వేతనాలు జమ చేయాలని నిర్ణయించడంతో దానికనుగుణంగానే కొన్ని జిల్లాల్లోని టీచర్లకు 16 నుంచి వేతనాలు మంజూరు చేశా రు. ఇంకా 20 జిల్లాల్లో కొందరికి ఎంప్లాయ్ నంబర్లు, ప్రాన్ నంబర్లు జారీ కాకపోవడంతో వేతనాలు జమ కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.