calender_icon.png 15 October, 2024 | 7:50 AM

బడుల్లోకి కొత్త టీచర్లు

15-10-2024 03:03:26 AM

నేడు స్కూల్స్ కేటాయింపు 

16న విధుల్లోకి

హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో 10,006 టీచర్ పోస్టులకు సంబంధించి ఇప్పటికే 1ః1 పైనల్ జాబితా విడుదల చేసిన విద్యాశాఖ ఈనెల 9న సీఎం రేవంత్ చేతుల మీదుగా నియామక పత్రాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరికి తదుపరి ప్రక్రియలో భాగంగా జిల్లా ర్యాంకుల ఆధారంగా స్కూల్ కేటాయింపు చేసి 16వ తేదీ నుంచి విధుల్లోకి వెళ్లాలని విద్యాశాఖ పేర్కొంది.

జిల్లాల వారీగా స్కూళ్ల ఖాళీలను ఆయా జిల్లాల వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. గత మూడు నెలల కితం బదిలీలు జరిగినా దాదాపు 7వేలకు పైగా మంది టీచర్లు ఇంకా రిలీవ్ కాలేదు. కొత్త టీచర్లు రాగానే పాత టీచర్లు రిలీవ్ కావాలని విద్యాశాఖ తెలిపింది.