వనపర్తి, జనవరి 19 ( విజయక్రాంతి ) : కొత్త ఆసరా పింఛన్లు, మహిళకు రూ. 2500 జనవరి 26 నుంచి ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు, భారత జాతీయ మహిళా సమాఖ్య ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు కళావతమ్మ డిమాండ్ చేశారు. ఆదివారం వనపర్తి సిపిఐ జిల్లా ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు.
ప్రభుత్వం జనవరి 26 నుంచి రైతు భరోసా, ఇందిర మ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు అమలు చేస్తామని ప్రకటించింది అన్నారు. వితంతువులు విక లాంగులు వద్ధులు ఆసరా పింఛన్ కోసం చేసుకున్న దరఖాస్తులు మూడేళ్లుగా పెండిం గులు ఉన్నాయన్నారు. వారికి వెంటనే కొత్త పింఛన్లు మంజూరు చేసి జనవరి 26 నుంచి పంపిణీ చేయాలన్నారు.
పింఛన్ వస్తున్న భర్త చనిపోతే భార్యకు, భార్య చనిపోతే భర్త కు నెలరోజుల లోగా ఆసరా పింఛను ఇచ్చే వారని, ఇప్పుడు నెలలు గడిచినా ఇవ్వటం లేదన్నారు. నెలలుగా పింఛన్ మంజూరు కాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. జన వరి 26 నుంచి వికలాంగులకు రూ.6000, ఇతరులకు రూ. 4000 పింఛన్ ఇవ్వాల న్నారు.
మహిళకు రూ. 2500 ఇస్తామన్న హామీని ఈనెల నుంచే అమలు చేయాలన్నా రు. నియోజకవర్గానికి ప్రభు త్వం మొదటి విడతలో 3500 ఇండ్లు కేటా యించిందని, ఇవి ఏ మూలకు సరిపోవని 5000 లకు పెంచాలన్నారు.
కొత్త రేషన్ కార్డులు కూడా జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు, ప్రతి గ్రామానికి 30, 40 కుటుంబాల అర్హుల జాబితా పంపారని, అర్హ త ఉన్న చాలా కుటుంబాల పేర్లు ఆ జాబితా లలో లేవన్నారు. పునః పరిశీలన చేయాల న్నారు. ఆరోగ్యారెంటుల్లో భాగమైన వీటిని వెంటనే అమలు చేయా లని కోరారు. సిపిఐ వనపర్తి పట్టణ కార్యదర్శి రమేష్, నాయ కులు లక్ష్మీనారాయణ, రాంబాబు, చిన్న కుర్మయ్య, జి కుర్మయ్య పాల్గొన్నారు.