తెలుగు ఫిలిమ్లోని 24 క్రాఫ్టులకు చెందిన ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్(టీఎఫ్ఐఈఎఫ్) ప్రధాన కార్యదర్శిగా అమ్మిరాజు కానుమల్లి విజయం సాధించారు. ఇంతకుముందు ఈ పదవిలో ఉన్న దొరై ఫెడరేషన్ నిబంధనల ప్రకారం అనర్హుడని నిర్ణయించిన నేపథ్యంలో కార్యదర్శి పోస్టుకు ఎన్నిక అనివార్యమయింది. ఆదివారం జరిగిన త్రిముఖ పోటీలో అమ్మిరాజు 35 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ప్రస్తుతం ఫెడరేషన్ ప్రెసిడెంట్గా అనిల్ వల్లభనేని, కోశాధికారిగా సురేశ్ ఉన్నారు.