మంథని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ఆన్ లైన్ సేవా కేంద్రంలో ఫేక్ ఫోన్ పేతో మోసం చేసి డబ్బులు తీసుకొన్న సంఘటన సోమవారం సంచలనం సృష్టించింది. కాల్వ శ్రీరాంపూర్ మండలం ఉషన్నపల్లి గ్రామానికి చెందిన రాజకుమార్ అనే యువకుడు పట్టణంలోని ఆన్ లైన్ కేంద్రంలో ఫేక్ ఫోన్ పే ట్రాన్సాక్షన్ చేయగా అనుమానం వచ్చిన నిర్వహకుడు పట్టుకొని పోలీసులకు అప్పాజెప్పాడు. నిన్న అదే ఆన్ లైన్ సెంటర్ లో ట్రాన్సాక్షన్ చేసి డబ్బులు తీసుకున్నాడు.