05-03-2025 12:00:00 AM
సోషల్ మీడియా, ఈ-మెయిల్స్ తనిఖీకి ఆదేశాలు
న్యూఢిల్లీ, మార్చి 4: ఆదాయపు పన్ను విభాగం అధికారులకు త్వరలో కొత్త బాధ్యతలు రానున్నాయి. సోషల్ మీడియా ఖాతాలు, ఈ-మెయిల్స్, ఆన్‌లైన్‌లో చేసిన పెట్టుబడులు, ట్రేడింగ్ అకౌంట్ల వివరాలను సైతం కోరవచ్చు. పన్ను ఎగవేతకు పాల్పడడం లేదా ఆదాయానికి మించి ఆస్తులు, నగ దు, బంగారం కలిగి ఉన్నట్లు గుర్తిస్తే మీ ఖాతాలన్నింటినీ తనిఖీ చేసే అధికారాలు అందుకోనున్నారు.
కేంద్రం కొత్తగా తీసుకొస్తున్న ఆదాయపు పన్ను బిల్లులో దీనికి సంబంధించిన నిబంధనలను పొం దుపరిచారు. ఈ మేరకు కొత్త బిల్లులో నిబంధనలను తీసుకొచ్చింది. డిజిటల్ వినియోగం పెరిగిన నేపథ్యంలో పన్నుల ప్రక్రియలో ఆర్థిక మోసం, అప్రకటిత ఆస్తులు, ఎగవేతలను నిరోధించడమే ఈ మార్పు ఉద్దేశమని సంబంధితవర్గాలు తెలిపాయి.