కానిస్టేబుళ్ల కుటుంబీకుల డిమాండ్
12 బెటాలియన్ ఎదుట బైఠాయింపు
నల్లగొండ, అక్టోబర్ 21 (విజయక్రాంతి): నల్లగొండ శివారులోని 12 బెటాలియన్ ఎదుట సోమవారం కానిస్టేబుళ్ల కుటుంబీకులు ఆందోళనకు దిగారు. కొత్తగా అమలు లోకి తేవాలని చూస్తున్న రికార్డు పద్ధతిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశా రు. కొత్త విధానం అమలులోకి వస్తే కానిస్టేబుళ్లు రెండు నెలలకోసారి ఇంటికి వచ్చే పరి స్థితి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. పనిభారాన్ని 8 గంటలకు తగ్గించాలని కోరా రు. రూల్‌కాల్ వ్యవస్థను సివిల్‌ఆర్ తరహా లో పెట్టాలని కోరారు. కామన్ మెస్ (అక్కడే ఉండి అక్కడే వండుకొని తినడం) విధానం తీసివేయాలని డిమాండ్ చేశారు. కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కడో ఒకచోట ఐదేండ్లు నిర్దిష్ట పోస్టింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాస్తారోకో కారణంగా అద్దంకి రహదారిపై గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చొర వ తీసుకుంటామని బెటాలియన్ కమాండెంట్ ఎన్వీ సత్యశ్రీనివాస్‌రావు హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.
భూ సమస్యలు పరిష్కరించండి
కరీంనగర్, (విజయక్రాంతి): కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం పోలీస్ అమరవీరుల దినోత్సవం నిర్వహించగా సీపీ అభిషేక్ మొహంతి హాజరయ్యారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యను పరిష్కరించాలని పోలీసు అమరవీరు ల కుటుంబ సభ్యులు సీపీని కోరారు. నగర సమీపంలోని పద్మనగర్‌లో 32 మంది అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం నివేశన స్థలాలను కేటాయించింది. అయితే ఈ స్థలంపై కొందరు కోర్టుకు వెళ్లడం, ప్రభుత్వం మరికొందరికి కేటాయించడంతో సమస్య ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉంది.