calender_icon.png 23 January, 2025 | 10:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నయా రికార్డు

29-08-2024 12:43:26 AM

ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పురుషుల సింగిల్స్‌లో డాన్ ఎవన్స్, కచనోవ్ మధ్య జరిగిన మ్యాచ్ రికార్డులకెక్కింది. తొలి రౌండ్‌లో భాగంగా వీరిద్దరి మధ్య పోరు రికార్డు స్థాయిలో 5 గంటల 35 నిమిషాల పాటు సాగింది. దీంతో యూఎస్ ఓపెన్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ సమయం సాగిన మ్యాచ్‌గా రికార్డులకెక్కింది. 1992లో అమెరికాకు చెందిన మైకెల్ చాంగ్, స్వీడన్‌కు చెందిన స్టెఫాన్ ఎడ్‌బర్గ్ మధ్య సెమీస్ పోరు 5 గంటల 26 నిమిషాల పాటు సాగింది. ఈ మారథాన్ మ్యాచ్‌లో డాన్ ఎవన్స్ (బ్రిటన్) 6 (8/6), 7 (7/2), 7 (7/4), 4 6 కచనోవ్ (రష్యా)పై విజయం సాధించాడు. టెన్నిస్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన మ్యాచ్ 2010 వింబుల్డన్‌లో జాన్ ఇస్నెర్ మధ్య దాదాపు 11 గంటల 5 నిమిషాలు సాగడం ఇప్పటికీ రికార్డుగా ఉంది.