మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమాదేవి
మంథని (విజయక్రాంతి): మంథని మున్సిపల్ పరిధిలోని అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం అందిస్తుందని మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమాదేవి(Municipal chairperson Pendri Ramadevi) ఒక ప్రకటనలో తెలిపారు. కులాల సర్వే (కులగణన) ఆధారంగా రూపొదించిన జాబితాను కేత్రస్థాయిలో అధికారులు పరీశీలనకు పంపారని, నిర్ణీత దృవీకరణ తర్వాత, అర్హులైన సభ్యులందరికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయబడుతాయని, అలాగే మీసేవ ద్వారా కుటుంబ సభ్యుల చేర్పుల కొరకు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను కూడా పరిశీలించడం జరుగుతుందన్నారు.
ప్రజావాణిలో వచ్చిన అన్ని దరఖాస్తులను కూడా అర్హత ప్రమాణాల ప్రకారం పరిశీలిస్తారని, తాజా దరఖాస్తుల సమర్పణ, ప్రస్తుతం కులగణన జాబితా పరిధిలోకి రాని వారు లేదా ఇప్పటికే సమర్పించిన సభ్యుల చేరిక దరఖాస్తు (జాబితాలో లేని వారు) కొత్త రేషన్ కార్డు కోసం మంథని మునిసిపల్ పరిధిలో నిర్వహించే, వార్డు సభ సమావేశాల్లో తాజా దరఖాస్తులను సమర్పించవచ్చున్నారు. అర్హులైన, అవసరమైన వ్యక్తులందరికి రేషన్ కార్డు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రజలు అపోహాలకు పోయి ఆందోళన చెందవద్దని అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు అందించేందుకు మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) సహకారంతో కృషి చేస్తామని హామీ ఇచ్చారు.