calender_icon.png 21 January, 2025 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త రేషన్‌కార్డులు వచ్చేస్తున్నాయ్!

21-01-2025 12:00:00 AM

  1.  జిల్లాలో ప్రస్తుత కార్డులు 2,76,929
  2. కొత్త కార్డుల కోసం 18 వేల కుటుంబాల పరిశీలన

కరీంనగర్, జనవరి 20 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. ప్రభుత్వానికి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న కుటుంబాల సర్వే పూర్తి దశకు చేరుకుంది. కరీంనగర్ జిల్లాలో 18 వేల కుటుంబాలు, కరీంనగర్ నగరంలో 3,480 కుటుంబాలు రేషన్ కార్డు లు లేని కుటుంబాలుగా గుర్తించారు.

పాత రేషన్ కార్డులు తొలగించడం లేదని ఇప్పటికే ప్రకటించడంతో పాత, కొత్త కలిపి రేషన్ కార్డుల జారీ ప్రక్రియ జనవరి 26న ప్రారం భం. కానుంది. అయితే అర్హత ఉన్నవారికి రేషన్కార్డులు అందజేస్తామని ఇప్పటికే కలెక్ట ర్ పేర్కొన్నారు.

గ్రామాల్లో నిర్వహించే గ్రామ సభలు, పట్టణాల్లో నిర్వహించే వార్డు సభల్లో అర్హత ఉన్నవారు ఇప్పటికీ దరఖాస్తు చేసు కుంటే పరిశీలిస్తామని కలెక్టర్ పేర్కొనడంతో అర్హుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం. 2,76,929 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందు లో ఆహార భద్రత కార్డులు 2,61,164, అంత్యోదయ కార్డులు 15,730, అన్నపూర్ణ కార్డులు 35 ఉన్నాయి.

2011 జనాభా లెక్కల ప్రకారం 8,04,968 మంది సభ్యులు రేషన్ బియ్యం పొందుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 566 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ర్ట ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ వాటా కలిపి ప్రతి ఒక్కరికి ఆరు కిలోల బి య్యాన్ని ఉచితంగా ఇస్తున్నారు. మొత్తం 50 వేల క్వింటాళ్ల వరకు బియ్యాన్ని ప్రతి నెల అందిస్తున్నారు.

కొత్త కార్డుల జారీ అనంతరం రేషన్ కార్డుల పెంపుతోపాటు కేటాయింపులు పెరగనున్నాయి. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనంతరం సన్నరకం బియ్యంతోపాటు నిత్యావసర సరుకులను కూడా అందుబాటులోకి తేవాలని రాష్ర్ట ప్రభుత్వం చూస్తున్నది.

పెళ్లయినవారి తంటాలు

కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సర్వేలో కొత్త కొత్త అంశాలు అధికారుల దష్టికి వస్తు న్నాయి. పెళ్లికి ముందు ఒకే కార్డులో ఉన్న వారి పేర్లు పెళ్లి అనంతరం వేరేచోట. కాపురం ఉంటున్న జంటలకు కొత్త కార్డులు ఇవ్వాలంటే పాత కార్డుల నుండి పేర్లు తొల గించవలసి ఉంటుంది. అయితే ఆ ప్రక్రియ ప్రస్తుతం పూర్తి కాలేదు.

దీంతో పెళ్లయి వేరే చోట ఉంటున్న అర్హత కలిగి ఉన్న కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నేటి నుండి 25 వరకు జరగనున్న గ్రామ, వార్డు సభల్లో ఇలాంటి మార్పులు, చేర్పుల దరఖాస్తులే ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నాయి.