calender_icon.png 21 January, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్-హసన్‌పర్తికి కొత్త రైల్వేలైన్

11-09-2024 02:42:48 AM

పనులకు అనుమతివ్వాలని కేంద్ర రైల్వే మంత్రిని కోరిన బండి సంజయ్

కరీంనగర్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): కరీంనగర్-హసన్‌పర్తి రైల్వే లైన్ ప్రాజెక్టు పూర్తి నివేదిక(డీపీఆర్) సిద్ధమైనందున నిర్మాణ పనులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కేం ద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ కోరారు. మంగళవారం ఢిల్లీలో అశ్విని వైష్ణవ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కరీంనగర్ నుంచి హసన్‌పర్తి వరకు 61.8 కిలోమీటర్ల మేరకు నిర్మించే కొత్త రైల్వే లైన్‌కు రూ.1,415 కోట్ల ఖర్చు అవుతుందని ఈ మేరకు డీపీఆర్ సిద్ధమైందని తెలిపారు.

రైల్వే బోర్డులో ఈ అంశం పెండింగ్‌లో ఉం దని, తక్షణమే ఆదమోదం తెలుపాలని కోరా రు. అలాగే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ రైల్వే స్టేషన్‌ను అప్ గ్రేడ్ చేయాలని, జమ్మికుంట స్టేషన్ వద్ద దక్షి ణ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగేలా అధికారులను ఆదేశించాలని బండి సంజయ్ కోరారు. ఉప్పల్ స్టేషన్‌లో అప్‌గ్రేడ్‌లో భాగంగా ప్లాట్‌ఫాం, రైల్వే స్టేషన్ భవనాన్ని ఆధునీకరించాలని కో రారు. పార్కింగ్‌ను విస్తరించాలని, సోలార్ ప్యానెళ్లను అమర్చాలని బండి సంజయ్ కోరారు.